వంటగదిలో మంటలు.. మహిళను కాపాడిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 22 , 2026 | 08:10 AM
ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో స్పందించి ఓ మహిళను ఆదుకున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒక మహిళ ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఎగ్జిక్యూటివ్.. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంలో ఆమెకు అండగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నాడు. శివాంగి జోషి ఇంట్లో వంటగది స్టవ్‌పై ఉన్న పెనం నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగడంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెంటనే ఇంట్లోకి వచ్చి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంటలను అదుపు చేయడంలో సహాయం చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని శివాంగి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియో వైరల్‌గా మారింది. అత్యవసర సమయంలో ధైర్యంగా, సమయస్ఫూర్తితో స్పందించిన డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, అందుబాటులో ఉన్న వివరాల్లో ఆ ఎగ్జిక్యూటివ్ పేరు, అతను పనిచేస్తున్న కంపెనీ పేరు స్పష్టంగా వెల్లడికాలేదు.
ఈ ఘటనపై శివాంగి జోషి స్పందిస్తూ.. వంటగదిలో మంటలు చెలరేగినప్పుడు వాటిని ఎలా అదుపు చేయాలో తనకు అర్థం కాలేదు. అలాంటి సమయంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెంటనే స్పందించి తనకు సహాయం చేశాడని తెలిపారు. అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవని పేర్కొన్నారు. మనుషులను వారి రూపం, వృత్తి లేదా చేసే పనిని బట్టి అంచనా వేయకూడదని, ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం, కరుణ, మానవత్వం ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు సైతం డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను అభినందిస్తూ.. ‘డెలివరీ సిబ్బందికి ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలి’, ‘అతని సమయస్ఫూర్తి అద్భుతం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాష్ట్ర పక్షిని బోనులో బంధిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
నిమ్స్‌లో లక్ష్మీ భాస్కర్ గ్యాంగ్