Share News

ఉస్మానియాలో అరుదైన సర్జరీ.. వైద్య బృందానికి మంత్రి దామోదర్ ప్రశంసలు..

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:54 PM

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. గ్లైకోజెన్ స్టోరేజ్ సమస్యతో బాధపడుతున్న18 నెలల బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

ఉస్మానియాలో అరుదైన సర్జరీ.. వైద్య బృందానికి మంత్రి దామోదర్ ప్రశంసలు..
Osmania Hospital

హైదరాబాద్‌, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో (Osmania Hospital) అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. గ్లైకోజెన్ స్టోరేజ్ సమస్యతో బాధపడుతున్న 18 నెలల బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న బాబుకి లివర్ మార్పిడి చేశారు. తండ్రి లివర్‌ నుంచి కొంత భాగాన్ని సేకరించి చిన్నారికి అమర్చారు. 14 గంటల పాటు క్లిష్ట శస్త్రచికిత్స కొనసాగింది.


ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా డాక్టర్లు చికిత్స అందజేశారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగంలో ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత అరుదని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా వైద్యుల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 04:51 PM