రంగారెడ్డి జిల్లాలో దారుణం.. నగదు, సెల్‌ఫోన్ కోసం ప్రయాణికుడి హత్య
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:03 AM
రంగారెడ్డిలో జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగదు, సెల్‌ఫోన్ కోసం ఓ ముఠా దారుణ హత్యకు పాల్పడింది.
రంగారెడ్డి, అక్టోబర్ 8: జిల్లాలోని చేవెళ్ల బస్టాండ్ ఆవరణలో దారుణ హత్య జరిగింది. ప్రయాణికుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు కోసం కొంతమంది దుండగులు హత్యకు పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి బస్సు సమయం ముగియడంతో ఓ ప్రయాణికుడు బస్టాండ్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇది గమనించిన నలుగురు దుండగులు.. ఆ ప్రయాణికుడితో మాట కలిపారు. నెమ్మదిగా.. బస్టాండ్ ఆవరణలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ ప్రయాణికుడి వద్ద గల నగదును, సెల్‌ఫోన్‌ను దోచుకుని పరారయ్యారు.
తెల్లవారుజామున విధులకు హాజరైన ఆర్టీసీ సిబ్బంది మృతదేహాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
Read Latest Telangana News And AP News