పదవి పోతుందనే ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారు.. సీఎంపై రాంచందర్ రావు ధ్వజం
ABN , Publish Date - Jun 07 , 2026 | 08:31 PM
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉప్పల్ సభలో కిషన్‌రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, జూన్7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉప్పల్ సభలో కిషన్‌రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు(ఆదివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రాంచందర్ రావు మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యవహారం రేవంత్‌రెడ్డికి తెలిస్తే.. ఆయన వ్యవహారం మొత్తం తమకు తెలుసునని అన్నారు. రేవంత్‌రెడ్డి ఆధారాలు అన్ని తమ దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయనకు పదవి పోతుందనే భయం మొదలైందని.. అందుకే ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి రాజకీయ జీవితం ఏందో తెలంగాణ సమాజానికి తెలుసునని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కు అయింది రేవంత్‌రెడ్డినే అని.. తాము కాదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. అందుకే ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేతలు ఆయనను కాపాడారని తెలిపారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలను కాళేశ్వరం అవినీతిలో కాపాడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి కేంద్రంలో అధికారం ఉందని ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడాలని రాంచందర్ రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News