హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సందడి.. పర్యటన షెడ్యూల్ వివరాలివే..
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:25 AM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో శనివారం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్‌లో ఈరోజు (శనివారం) పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. హెచ్‌ఐసీసీ (HICC) నోవెటెల్ హోటల్లో ఆయన బస చేశారు. నేడు భారత్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. గిగ్ వర్కర్లతో సమావేశంలో కూడా పాల్గొననున్నారు.
ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 10:20 గంటల వరకు విదేశీ ప్రతినిధులతో రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. 10:40 గంటలకు నోవెటెల్ నుంచి రోడ్డు మార్గంలో శిల్పారామం ముందున్న ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకోనున్నారు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అలాగే, 11 గంటల నుంచి 12 గంటల వరకు గిగ్ వర్కర్లతో సమావేశం కానున్నారు. 12 గంటలకు హెచ్‌ఐసీసీకి రానున్నారు. 12 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు భారత్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 4:30 గంటలకు హెచ్‌ఐసీసీ నుంచి శంషాబాద్‌కు రాహుల్‌గాంధీ వెళ్లనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News