Share News

ఉస్మానియా.. అక్రమాలపై విచారణ జరిపించాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 08:28 AM

ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఉస్మానియా.. అక్రమాలపై విచారణ జరిపించాలి

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్య మంత్రికి లేఖ రాశానని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. చెన్నైకు చెందిన ప్రైవేట్‌ సంస్థకు ఆసుపత్రిలో శుభ్రత బాధ్యత అప్పగించారని వివరించారు.


city2.2.jpgఅధికారిక రికార్డుల ప్రకారం, ప్రభుత్వం ప్రతి నెలా సుమారు 787 మంది కార్మికులకు చెల్లింపులు చేస్తోందని, వాస్తవంగా విధుల్లో ఉన్న కార్మికులు 400 మందేనని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ప్రతి కార్మికుడికీ నెలకు సుమారు 11,400 చెల్లిస్తున్నారని, వాస్తవంగా పనిచేసే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో, ప్రతి నెల లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతున్న అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 08:29 AM