Share News

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:50 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు
Gold, Silver Rates on April 14

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత వారం ఓ మోస్తరు స్థాయిలో పెరిగిన ధరలు ఈ వారం తిరోగమనంలో పయనిస్తున్నాయి. అధిక ముడిచమురు ధరల కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం, డాలర్ బలపడటం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 14) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,52,450గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,39,740. కిలో వెండి రూ.2,59,900ల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.


చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర గరిష్ఠంగా రూ.1,53,370ల వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో ధర రూ.1,52,450గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,40,590గా, ముంబై, బెంగళూరు నగరాల్లో రూ.1,39,740గా ఉంది. వివిధ నగరాల్లో వెండి (కిలో) ధరలు రూ.2.54 లక్షల నుంచి రూ.2.59 లక్షల మధ్య ఉన్నాయి. నిన్న దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.380ల మేర తగ్గింది. ఆర్నమెంటల్ గోల్డ్ ధరలో రూ.350ల మేర కోత పడింది. వెండి ధర కూడా సుమారు రూ.5 వేల మేర తగ్గింది.


ఈ వార్తలనూ చదవండి:

చర్చలు విఫలం.. మార్కెట్‌ పతనం

పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ధరలకు యుద్ధం పోటు

Updated Date - Apr 14 , 2026 | 07:08 AM