వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కుటుంబ సభ్యులకు అప్పగింత
ABN , Publish Date - Aug 10 , 2026 | 10:52 AM
వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం బ్రెయిన్ డెడ్‌తో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థిని ప్రియాంక నిన్న (ఆదివారం) బ్రెయిన్ డెడ్‌తో (Medical Student Priyanka Death) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ ఆస్పత్రికి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. పోస్టుమార్టం జరుగుతున్న తీరు, ప్రియాంక కేసుకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియాంక స్వగ్రామం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మృతదేహాన్ని తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ప్రియాంక తండ్రిని మంత్రి వాకటి శ్రీహరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓదార్చారు. ఆమె స్వస్థలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి ఏపీ మంత్రి టీజీ భరత్, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల చెక్‌ను ప్రియాంక తండ్రికి మంత్రి టీజీ భరత్ అందజేయనున్నారు. తమ కలల సౌధం కూలిపోయిందని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
కాగా, రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో మద్యం మత్తులో ప్రియాంకను ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ప్రమాదానికి కారణమైన యువకులపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ,సెక్షన్లు మార్చి నిందితులపై రాజమహేంద్రవరం పోలీసులు హత్య నేరం మోపారు.
వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News