ఉల్లి ధర పైపైకి
ABN , Publish Date - Jun 20 , 2026 | 10:11 AM
ఉల్లిగడ్డ ధర రోజురోజు పెరుగుతోంది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లోకి మహారాష్ట్ర నుంచి వచ్చిన మొదటి రకం ఉల్లిగడ్డ క్వింటా ధర రూ.2వేలు పలికింది.
మలక్‌పేట మార్కెట్‌లో క్వింటా రూ.2వేలు
హైదరాబాద్: ఉల్లిగడ్డ ధర రోజురోజు పెరుగుతోంది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లోకి శుక్రవారం మహారాష్ట్ర నుంచి వచ్చిన మొదటి రకం ఉల్లిగడ్డ క్వింటా ధర రూ.2వేలు పలికింది. జూన్ మొదటి వారంలో క్వింటా రూ.1100 ఉండగా ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. మహారాష్ట్ర నుంచి దిగుబడి బాగా తగ్గడంతో డిమాండ్‌తో పాటు ధరలు కూడా పెరిగాయి. గతంలో ప్రతీ రోజు 20వేల క్వింటాళ్ల పైచిలుకు ఉలిగడ్డ రాగా.. ప్రస్తుతం 8వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోంది.
పంట అమ్ముకొనే సీజన్ ముగియడం, వర్షాకాలం రావడం, కొత్త పంటకు రైతులు సన్నద్ధం అవుతండడంతో మార్కెట్‌కు పంట రాబడి తగ్గిందని, దీంతో ధర పెరిగిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా అంతంత మాత్రంగానే ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాలు కురుస్తుండడంతో మార్కెట్‌లోకి రైతులు తెచ్చిన పంట తడువకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు గ్రేడ్ టు సెక్రెటరి చిలక నర్సింహరెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News