‘నేనే బాస్’ కామెంట్‌పై క్లారిటీ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:30 AM
తనను ఇబ్బందుల్లో పడేసిన ‘నేనే బాస్’ కామెంట్‌పై ట్రంప్ తాజాగా స్పందించారు. శుక్రవారం జరిగిన ‘ది ఆక్సియోస్’ షోలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘నేనే బాస్’ కామెంట్‌పై వివరణ ఇచ్చారు.
న్యూయార్క్, జూన్ 20: జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘నేనే బాస్’ కామెంట్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్ కారణంగా ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనను ఇబ్బందుల్లో పడేసిన ‘నేనే బాస్’ కామెంట్‌పై ట్రంప్ తాజాగా స్పందించారు. శుక్రవారం జరిగిన ‘ది ఆక్సియోస్’ షోలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘నేనే బాస్’ కామెంట్‌పై వివరణ ఇచ్చారు. ఆ కామెంట్ చేయటంలో తన ఉద్దేశం పూర్తిగా వేరని అన్నారు. తన కామెంట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
షో హోస్ట్ ట్రంప్‌ను ‘మీరు లోపలికి వచ్చి.. నేనే బాస్.. అని అన్నారు. వారిలో ఎంతమంది దాన్ని నమ్ముతారు?’ అని ప్రశ్నించాడు. ఇందుకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘అందరూ నమ్ముతారు. ఎందుకంటే నేను సరదాగా ఆ మాట అన్నాను. నేను లోపలికి వచ్చే సమయానికి వేరే దేశాలకు చెందిన లీడర్లందరూ కూర్చుని ఉన్నారు’..
‘వారందరూ చాలా పేరు ప్రఖ్యాతలు గల వారు.. దేశాధినేతలు. నేను లోపలికి వెళ్లిన వెంటనే వాళ్లను చూస్తూ ‘నేనే బాస్’ అని అన్నాను. నేను సరదాగా జోక్ చేశాను. ఈ కామెంట్ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నేను నమ్మలేకపోతున్నాను. నేను సరదా కోసం మాత్రమే చేశాను. బాస్ అవ్వాలని కాదు’ అని క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందా?
యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి