ఏఐని ఎలా వాడాలో తెలియకపోతే లేఆఫ్స్ ముప్పు అధికం!
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:52 AM
ఏఐ అక్షరాస్యత లేని వారికి లేఆఫ్స్ రిస్క్ ఎక్కువని గ్యాలప్ సంస్థ పేర్కొంది. టెక్ రంగంలో ఈ ముప్పు మరింత అధికమని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టెక్ రంగంలో చోటుచేసుకుంటున్న లేఆఫ్స్‌కు ఏఐ కారణమన్న భయాలు నెలకొన్నాయి. అయితే, ఏఐ వాడకంపై అవగాహన లేకపోవడం కూడా కొందరి లేఆఫ్స్‌కు కారణమని గాలప్ సంస్థ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ఏఐ అక్షరాస్యత ఉన్న టెక్ వర్కర్స్‌తో పోలిస్తే ఈ నైపుణ్యం లేని వారికి లేఆఫ్స్ ముప్పు మూడు రెట్లుగా ఉన్నట్టు సంస్థ పేర్కొంది. 23 వేల మంది యూఎస్ వర్కర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది.
అన్ని రంగాల్లో ఏఐ ప్రభావం కనిపిస్తోందని సంస్థ పేర్కొంది. ఏఐ వినియోగం తెలిసిన వారికి లేఆఫ్స్ ముప్పు తక్కువని తేల్చింది. ఏఐని అప్పుడప్పుడూ మాత్రమే వాడే టెక్ వర్కర్లకు ఏఐ ముప్పు 18 శాతమని, ఏఐని నిత్యం వాడే వారు ఎదుర్కొనే లేఆఫ్ రిస్క్‌కు ఇది మూడు రెట్లు అని వెల్లడించింది. ఇతర రంగాల్లో కూడా ఈ వ్యత్యాసం కనిపించిందని పేర్కొంది. ఏఐ వాడే వారికి లేఆఫ్స్ రిస్క్ 3 శాతం ఉండగా ఏఐ వాడని వారి రిస్క్ 5 శాతంగా ఉన్నట్టు తేల్చింది.
వ్యవస్థాగత మార్పులు, ఖర్చుల తగ్గింపు వంటి చర్యల వల్ల తాము జాబ్స్ కోల్పోయినట్టు సర్వేలో పాల్గొన్న అనేక మంది పేర్కొన్నారు. కంపెనీల్లో కనిపిస్తున్న ఈ మార్పుల వెనుక ఏఐ ప్రభావం ఉందని కూడా సర్వే తేల్చింది. ఇటీవల కాలంలో అనేక టెక్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసింది. ఏఐపై భారీగా పెట్టుబడులను పెడుతున్న సంస్థలు ఈ క్రమంలో లేఆఫ్స్ చేపడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి
ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చండి