నేపాల్ వరదల్లో గల్లంతయిన సుహాసిని రెడ్డి సేఫ్
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:37 PM
నేపాల్ వరదల్లో గల్లంతైన సుహాసిని రెడ్డి కందిమల్ల సేఫ్‌గా ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నేపాల్ వరదల్లో గల్లంతైన సుహాసిని రెడ్డి కందిమల్ల సేఫ్‌గా ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సుహాసిని రెడ్డి స్వయంగా తమకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అయితే, ఆమె ఉన్న ప్రాంతం, ఆస్పత్రి పేరు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అధికారిక నిర్ధారణ ఇంకా అందాల్సి ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఆమె సోదరులు ప్రస్తుతం భారత్‌కు వస్తున్నారని చెప్పారు. రేపు లేదా సోమవారం నేపాల్‌కు వెళ్లి, ఆమె ఉన్న ఆస్పత్రిని గుర్తించి ప్రత్యక్షంగా కలిసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ అధికారులు, సంబంధిత సంస్థలతో నిరంతరం తాము సమన్వయం చేస్తున్నామని తెలిపారు. అధికారిక నిర్ధారణ అందిన వెంటనే తదుపరి సమాచారాన్ని మీడియాకు తెలియజేస్తామని సుహాసిని రెడ్డి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల
ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్
సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News