ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:02 PM
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై విచారణకు మంత్రి ఆదేశించారు.
జహీరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Telangana Minister Damodar Rajanarsimha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై విచారణకు మంత్రి ఆదేశించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు.
ఈ మేరకు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, డ్యూటీ డాక్టర్ గైర్హాజరు, ప్రైవేట్ డాక్టర్‌తో చికిత్సపై మీడియాలో వచ్చిన కథనాలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తుతో మంత్రి దామోదర్ మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ హుకుం జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News