Share News

రౌడీషీటర్ నయీమ్‌ను నరికి చంపిన దుండగులు.. కారులో వచ్చి దాడి చేసి..

ABN , Publish Date - Sep 15 , 2026 | 08:17 AM

హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో రౌడీషీటర్‌‌ నయీమ్‌ను కొంతమంది దుండగులు హత్య చేశారు. వేటకొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు.

రౌడీషీటర్ నయీమ్‌ను నరికి చంపిన దుండగులు.. కారులో వచ్చి దాడి చేసి..
Rowdy Sheeter Nayeem Case

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో రౌడీషీటర్‌‌ నయీమ్‌ను కొంతమంది దుండగులు హత్య చేశారు. దుండగుల నుంచి పారిపోయే క్రమంలో ప్రాణభయంతో సుప్రీమ్ వైన్స్‌లోకి అతను వెళ్లినా దుండగులు వదల్లేదు. ఆ వైన్స్‌లోనే దుండగులు నరికి చంపేశారు. మృతుడిని వెంటాడి మరీ, వేటకొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. మృతుడిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు అని పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే నాగోలు పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.


ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు కారులో వచ్చినట్లుగా.. ఈ ఘటన అనంతరం అదే కారులోనే దుండగులు పరారయ్యారని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై నాగోలు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య చేసింది ఎవరనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు

శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 08:31 AM