Share News

తెలంగాణలో క్రాప్ హాలిడేపై మంత్రి తుమ్మల క్లారిటీ

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:36 PM

రాష్ట్రంలో క్రాప్ హాలిడేపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని స్పష్టం చేశారు.

 తెలంగాణలో క్రాప్ హాలిడేపై మంత్రి తుమ్మల క్లారిటీ
Telangana Minister Tummala Nageswara Rao

హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్రాప్ హాలిడేపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. క్రాప్ హాలిడేపై ప్రతిపక్షాల నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని.. రైతులు ఈ విషయాన్ని నమ్మొద్దని అన్నారు. ఎల్‌నినో ప్రపంచవ్యాప్త విపత్తు అని.. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలను తాము తీసుకుంటున్నామని తెలిపారు. ఆరు నెలలుగా రైతన్నలకు ఎల్‌నినోపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి, సమీకృత పంటల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.


రైతన్నలు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలి..

ప్రతి వారం వాతావరణం, వర్షపాతం, భూగర్భ జలాల వివరాలను అన్నదాతలకు చేరవేస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతులకు సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో 365 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి, రైతన్నలకు అండగా తమ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఖరీఫ్ పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నామని చెప్పారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తోందని తెలిపారు. రైతన్నలను నష్టాల నుంచి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తోందని.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పిస్తోందని వెల్లడించారు. నవంబర్ నుంచి మార్చి వరకు మొత్తం 35.21 లక్షల ఆయిల్‌పామ్ మొక్కలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రైతన్నలు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 03:25 PM