Share News

హెల్త్ ఇన్నోవేషన్స్‌కు తెలంగాణను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:11 PM

హెల్త్ ఇన్నోవేషన్స్‌కు తెలంగాణను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

హెల్త్ ఇన్నోవేషన్స్‌కు తెలంగాణను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు
Telangana Minister Sridhar Babu

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): హెల్త్ ఇన్నోవేషన్స్‌కు తెలంగాణను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్‌లో ‘హోమా CME 2026’ జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ది న్యూ పారాడైమ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.


50 మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్..

ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్‌ప్లోరర్’ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 50 మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్ అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్టార్టప్‌లను హెల్త్‌కేర్‌తో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో సమగ్ర హెల్త్ ఇన్నోవేషన్ ఎకోసిస్టం అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.


డయాబెటిస్, మెటబాలిక్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి అవసరం..

డయాబెటిస్, మెటబాలిక్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి అవసరమని మంత్రి తెలిపారు. లైఫ్‌స్టైల్ డేటా విశ్లేషణతో వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని సూచించారు. హెల్త్‌కేర్ రంగంలో కొత్త ఆలోచనలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వైద్య నిపుణులు, పరిశోధకులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 05:41 PM