Share News

ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్‌జీ పై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమావేశం

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:04 PM

ఎల్‌నినో నేపథ్యంలో మంత్రి సీతక్క వీబీ-జీ రామ్‌జీ పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుగా ఉపాధి పనులకు సంబంధించి ఎనిమిది నెలల కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్‌జీ పై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమావేశం
minister seethakka on vb g ram g

హైదరాబాద్, అక్టోబర్ 24: ఎల్‌నినో నేపథ్యంలో మంత్రి సీతక్క వీబీ-జీ రామ్‌జీ పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరవు ప్రభావ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, రైతు కూలీలకు ఉపాధి కల్పించించేందుకు ఎనిమిది నెలల వరకు ఉపాధి పనులకు సంబంధించి కార్యాచరణను రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.


‘కరవు నేపథ్యంలో చిన్న రైతులు సైతం ఉపాధి హామీ పనులవైపు వచ్చే అవకాశమున్న కారణంగా.. ప్రతి రెండు నెలలకు ఒక కార్యాచరణ చొప్పున ఎనిమిది నెలల వరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనులను గుర్తించాలి. గుర్తించిన 318 రకాల పనుల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా 50 రకాల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అక్టోబర్ 29 లేదా 30 నాటికి మండలస్థాయి కమిటీల ఆధ్వర్యంలో ప్రణాళికలు పూర్తి చేయాలి. నవంబర్ 1 నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలి. సీజన్ల, నెలలు, కాలాలు, ప్రాంతాల వారీగా పనులు, పని దినాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలి. స్థానిక పరిస్థితులు, వాతావరణం, కూలీల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలి.


కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలల ప్రహరీ గోడలు, గ్రామ సంఘాల భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సౌర విద్యుత్ సంబంధిత పనులను కూడా గుర్తించాలి. నిధులు పూర్తిగా వినియోగించుకోవాలి. ఉపాధి పనుల ప్రణాళిక, అమలులో సర్పంచులను భాగస్వాములను చేయాలి. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమన్వయంతో కూలీల భాగస్వామ్యం పెంచాలి. ముఖ్యమంత్రి సూచనల మేరకు కాలువల మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలి. గిరిజన ప్రాంతాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఉపాధి పనులను పెంచాలి. గ్రామాలకు శాశ్వత ఆస్తులు సమకూరేలా ఉపాధి పనులు చేపట్టాలి. మండల సమన్వయ కమిటీల ద్వారా ప్రాధాన్యతా పనులను గుర్తించి అమలు చేయాలి. ఒకేసారి అన్ని పనులు పూర్తి చేయకుండా ఏడాది పొడవునా ఉపాధి లభించేలా ప్రణాళికలు ఉండాలి. ఐటీడీఏల పరిధిలో 7 శాతం వర్క్ షేర్‌కు అనుగుణంగా పనులను గుర్తించాలి. ఉపాధి పనుల ఎంపిక నుంచి అమలు వరకు స్పష్టమైన టైమ్‌టేబుల్ పాటించాలి‘ అని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 09:05 PM