బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు: పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:38 PM
బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ శాఖ లో పెండింగ్ అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఈరోజు(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి , బీసీ గురుకులాల సెక్రెటరీ సైదులు , ఎండీ మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో పెండింగ్ అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. బీసీ విదేశీ విద్యానిధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై సమావేశంలో మాట్లాడామని తెలిపారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ గురుకులాల్లో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించాలని నిర్ణయించామని అన్నారు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల అద్దెలు ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం సమయానికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు చేరాలా చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కాటమయ్య రక్షణ కవచాలను.. శిక్షణ ఇచ్చిన వారికి కిట్స్ అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్
ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు
Read Latest Telangana News And AP News And International News And Telugu News