Share News

లింగ నిర్ధారణకు పాల్పడే కేంద్రాలపై ప్రత్యేక నిఘా: మంత్రి దామోదర్

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:50 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఆయా జిల్లాలకూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

లింగ నిర్ధారణకు పాల్పడే కేంద్రాలపై ప్రత్యేక నిఘా: మంత్రి దామోదర్
Telangana Minister Damodar Rajanarsimha

హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ (Telangana Minister Damodar Rajanarsimha) వ్యాఖ్యానించారు. ఆయా జిల్లాలకూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు (సోమవారం) రాష్ట్ర సచివాలయంలో వైద్యశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలుపై కఠిన నిఘా ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే సెంటర్లను ఉపేక్షించబోమని హెచ్చరించారు.


రోగులపై అనవసర ఆర్థిక భారం వద్దు..

తెలంగాణలో 477 ఏఆర్‌టీ, సరోగసీ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మంత్రి దామోదర వెల్లడించారు. 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేశామని చెప్పారు. 50 చోట్ల డీవియేషన్స్‌ గుర్తించామని తెలిపారు. 2 సెంటర్ల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని.. 9 సెంటర్ల అనుమతులు తాత్కాలికంగా రద్దు చేశామని చెప్పుకొచ్చారు. ఫెర్టిలిటీ సేవల పేరుతో రోగులపై అనవసర ఆర్థిక భారం వద్దని అన్నారు. గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల పనితీరుపై మంత్రి సమీక్షించారు.


పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి..

రెండు ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్లలో 39,802 మందికి ఫెర్టిలిటీ సేవలు అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. 545 ఐవీఎఫ్ కేసులు, 521 ఐయూఐ ప్రక్రియలు పూర్తి చేసినట్లు వివరించారు. పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి జులై మధ్యలో హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లలో 2,600 తనిఖీలు నిర్వహించామని తెలిపారు. లింగ నిర్ధారణకు పాల్పడే కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 07:06 PM