హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
ABN , Publish Date - Aug 17 , 2026 | 08:21 AM
హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రేగు మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రేగు మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్.. కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మహేశ్ కుటుంబ సభ్యులు సొంతూరుకు వెళ్లారు. దీంతో మహేశ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, చెల్లిని మిస్ అవుతున్నానంటూ తన చెల్లికి మెసేజ్ పంపించాడు.
ఆ మెసేజ్‌పై అనుమానం వచ్చిన చెల్లి.. సమీప బంధువు గిరిబాబుకు సమాచారం అందించి ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. గిరిబాబు మహేశ్ ఇంటికి వెళ్లి పరిశీలించగా.. పడక గదిలో ఉరివేసుకున్న స్థితిలో మహేశ్ కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహేశ్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
వార్తలు కూడా చదవండి...
బిడ్డకే న్యాయం చేయలేని వారు.. ప్రజలకు న్యాయం చేస్తారా?: సీఎం రేవంత్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News