Share News

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Oct 19 , 2026 | 10:49 AM

హైదరాబాద్‌లో హైకోర్టుకు ఎదురుగా మదీనా క్రాస్ రోడ్ వద్ద ఉన్న బాంబే హోజరీ వస్త్ర దుకాణం, గోదాములో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
Hyderabad Fire Accident

హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు సమీపంలోని మదీనా వద్ద ఉన్న 'బాంబే హోజరీ'లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున, హైకోర్టుకు ఎదురుగా ఉన్న మదీనా క్రాస్ రోడ్ వద్ద గల 'బాంబే హోజరీ' వస్త్ర దుకాణం, గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


బాంబే‌హౌజరీ హోల్‌సేల్ షాప్, గోదాం నుంచి భారీగా పొగలు వెలువడుతున్నాయి. పొగల ధాటికి స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ కావడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరవు: మంత్రి పొన్నం ప్రభాకర్

మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 12:23 PM