Share News

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ట్రావెల్స్ బస్సులు దగ్ధం

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:24 AM

హెదరాబాద్ జీడిమెట్ల దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలోని గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాలిపోయాయి.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ట్రావెల్స్ బస్సులు దగ్ధం
Hyderabad Massive Fire Accident

హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): హెదరాబాద్ జీడిమెట్ల దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలోని గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాలిపోయాయి. ఐదు బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.


బస్సులు పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో ఒకదానికొకటి మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంత మేర జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు ప్యాలెస్‌ నుంచి ఏపీపై జగన్ కక్ష సాధిస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 07:02 AM