హైదరాబాద్‌లో యువకుడి హత్య.. చున్నీతో బిగించి చంపిన వివాహిత
ABN , Publish Date - Sep 29 , 2026 | 08:27 AM
హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో సాయి అనే యువకుడిని ఓ మహిళ హత్య చేసింది. వివాహిత అనిషా సింగ్ చున్నీని అతడి మెడకు బిగించి చంపేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో సాయి అనే యువకుడిని ఓ మహిళ హత్య చేసింది. వివాహిత అనిషా సింగ్ చున్నీని అతడి మెడకు బిగించి చంపేసింది. యువకుడు గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళకు వేధింపులు తాళలేకనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాయిని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించి మరీ ఆమె అంతమొందించింది. అతడిని పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News