Share News

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:31 AM

మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా నోటీసులు అందుకుంటున్న పలువురు ఓటర్లు తర్జనబర్జన పడుతున్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు
Malkajgiri SIR notices

  • 12,700 మంది విచారణ పూర్తి

  • ఇంటింటికి వెళ్లి అందజేయని బీఎల్‌వోలు

హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా నోటీసులు అందుకుంటున్న పలువురు ఓటర్లు తర్జనబర్జన పడుతున్నారు. ఎన్యుమరేషన్‌ ఫారాలను సక్రమంగా పూర్తిచేసినపప్పటికీ తమకు నోటీసులు రావడం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొందరు బీఎల్‌వోలు ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వకుండా కేవలం ఫోన్‌ చేసి కార్యాలయాలకు రావాలని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విచారణకు హాజరుకావడానికి ఆలస్యమవుతోంది.


కొందరు రేపు, మాపంటూ వాయిదా వేస్తున్నారు. ఇప్పటి వరకు 48,505 మందికి నోటీసులు అందజేయగా 12,700 విచారణ పూర్తయింది. నోటీసులు అందుకున్న వారిలో 40 ఏళ్ల వయస్సు దాటితే నోటీసులో పేర్కొన్న 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. 40 ఏళ్లలోపు వయస్సు ఉంటే వారితోపాటు తల్లిదండ్రులకు సంబంధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.


city8.2.jpgనియోజకవర్గం వివరాలు

  • ఓటర్లు: 3,20,187

  • నోటీసులు ఇవ్వాల్సింది: 2,13,141 మందికి

  • అందుకున్నవారు: 48,505

  • విచారణ పూర్తి: 12,700


ఈ వార్తలు కూడా చదవండి:

మట్టి గణపతులకు ధర నిర్ణయం

లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 11:31 AM