Share News

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి..

ABN , Publish Date - Sep 05 , 2026 | 10:31 AM

బొలీవియాలోని ఓ మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి..
Bolivia Military Base Explosion

ఇంటర్‌నెట్ డెస్క్: బొలీవియాలోని ఓ మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వియాచా సిటీలోని మిలిటరీ బేస్‌లో ఆయుధాలు దాచే ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం అయింది. భారీ సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు.


ఈ సంఘటనపై బొలీవియా డిఫెన్స్ మినిస్టర్ ఎర్నెస్టో జస్టినియానో మాట్లాడుతూ.. ‘పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులు ఉన్నారు. గాయపడ్డ వారిలో 52 మంది సాధారణ పౌరులు కాగా.. మిగిలిన వారందరూ సైనికులు’ అని తెలిపారు. వియాచా హెల్త్ డైరెక్టర్ రితా నెబ్రెస్కా మాట్లాడుతూ..‘ఎంత మంది చనిపోయారనే దానిపై క్లారిటీ లేదు. 10 నుంచి 15 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నాము’ అని తెలిపారు. పోలీసులు మాట్లాడుతూ.. ‘పేలుడు కారణంగా డజన్ల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పేలుడు జరగడానికి గల కారణం తెలీదు. దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

సర్‌.. వినిపించుకోరు..!

పాతబస్తీ మెట్రోపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌

Updated Date - Sep 05 , 2026 | 10:37 AM