Share News

మట్టి గణపతులకు ధర నిర్ణయం

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:32 AM

పర్యావరణ పరిరక్షణ, జల వనరుల కాలుష్య నియంత్రణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది.

మట్టి గణపతులకు ధర నిర్ణయం
Vinayaka Chavithi

హైదరాబాద్‌ సిటీ: పర్యావరణ పరిరక్షణ, జల వనరుల కాలుష్య నియంత్రణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. మహానగరంలో లక్ష మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు విగ్రహాల సమీకరణకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఎనిమిది అంగుళాల విగ్రహాలు 70 వేలు, ఒక అడుగు విగ్రహాలు 20 వేలు, ఒకటిన్నర అడుగుల విగ్రహాలు 10 వేలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.


city3.2.jpgఎనిమిది అంగుళాల విగ్రహం ఒక్కొక్కటి గరిష్ట ధరగా రూ.34.30, ఒక అడుగు విగ్రహానికి రూ.142, ఒకటిన్నర అడుగుల విగ్రహాలకు రూ.220గా పేర్కొంటు బిడ్‌లు ఆహ్వానించారు. ఒక ఎనిమిది అంగుళాల విగ్రహం రూ.32.18, ఒక అడుగు విగ్రహం రూ.140, ఒకటిన్నర అడుగుల విగ్రహం రూ.220 ధర కోట్‌ చేశారు. దీంతో అదే ధరకు విగ్రహాలు సరఫరా చేయాలని జీహెచ్‌ఎంసీతో ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీలకు సూచించారు.


లెక్కా.. పత్రం లేకుండా..

ఏటా విగ్రహాల పంపిణీ పేరిట జీహెచ్‌ఎంసీ రూ.80 లక్షల నుంచి రూ.కోటి ఖర్చు చేస్తోంది. పర్యావరణహిత విగ్రహాల పంపిణీ నిర్ణయం మంచిదే అయినప్పటికీ, ఇందులో కొందరు అధికారులు, ఉద్యోగులు అవినీతికి తెర లేపుతున్నారు. గతంలో సరఫరా చేసిన ఏజెన్సీల ప్రతినిధులు కొందరు అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని విగ్రహాలు సరఫరా చేశారు..? ఎన్ని పంపిణీ చేశారన్న దానిపై సరైన లెక్కలు లేవు. అధికారులు, ఉద్యోగులు రాసినవే లెక్కలు అన్నట్లుగా పరిస్థితి మారింది. హల్త్‌ విభాగంలోని ఓ అధికారి, కింది స్థాయి ఉద్యోగి రూ.లక్షలు వసూరు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 08:32 AM