నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
ABN , Publish Date - Sep 05 , 2026 | 07:06 AM
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శనివారం అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ అవార్డులందజేస్తారు.
విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవం
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శనివారం అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ అవార్డులందజేస్తారు. పాఠశాల టీచర్లు 79 మంది, జూనియర్ లెక్చరర్లు 23మంది, సాంకేతిక విద్యాశాఖలో లెక్చరర్లు 14మంది, యూనివర్సిటీ అధ్యాపకులు 35 మంది, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 17, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ అధ్యాపకులు ఆరుగురు ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ప్రశంసా పత్రం, మెడల్, మొమెంటో, శాలువా, రూ.20వేల నగదు బహుమతి అందజేస్తారు.
ఈ వార్తలను కూడా చదవండి
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఆందోళన చెందొద్దు