హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఆందోళన చెందొద్దు
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:35 PM
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్ , సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్ర వారం నగరంలోని 11వ వార్డులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు కలిసి కోరగా, కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారని అన్నారు. బెంచ్ ఏర్పాటు అనేది న్యాయమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. న్యాయవాదులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆందోళన చేయకుండా ఓపికగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి
ఈసారి వర్షాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అందరూ కలిసి చిన్న పరిమాణంలో మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ కోరారు. చిన్న మట్టి విగ్రహాలను నిమజ్ఞనం చేయడంతో నీటి వినియోగం త క్కువగా ఉండటంతో పాటు, అవసరమైతే ఇంటి వద్దే నిమజ్ఞనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.