పండుగ రోజూ కొనసాగిన దీక్షలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:30 PM
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరుకున్నాయి.
కర్నూలు లీగల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరుకున్నాయి. శ్రీకృష్ణాష్టమి పండుగ రోజూ కూడా న్యాయవాదులు సివిల్ డ్రెస్సులో రిలే నిరాహారదీక్షలను కొనసాగించారు. రాయలసీమ న్యాయవాదుల జేఏసీ అధ్య క్షుడు బి.చంద్రుడు మాట్లాడుతూ న్యాయవాదులు పండుగను సైతం జరుపుకోకుండా రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం వారిలో ఉన్న కార్యదీక్షత, పట్టుదలను తెలియ జేస్తుందని, ఇకనైనా ప్రభుత్వం హైకోర్టు బెంచ్ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్నవారిలో న్యాయవాదులు జి.మురళికృష్ణ, ఎం.రాజేంద్ర ప్రసాద్, ఏ.నేతన్య, ఈదుల బాలాజీరెడ్డి ఎం.శ్రీనివాసరావు ఉన్నారు.