Share News

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు ముమ్మరం

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:01 AM

ఎమ్మెల్యే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు ముమ్మరం

హైదరాబాద్, సెప్టెంబర్ 05: ఎమ్మెల్యే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. సుమంత్‌తో పాటు మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కింద కేసును నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ముగ్గురు నిందితులు.. బత్తిని అరుణ్‌కుమారెడ్డి, పసుపులేటి కార్తీక్‌కుమార్, ముత్యాల మహేందర్‌రెడ్డిలను నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో వీరిని శుక్రవారం మొదటి రోజు పోలీసులు విచారించారు. వారిని ఈ రోజు కూడా విచారించనున్నారు.


మొదటి రోజు కస్టడీలో సుమంత్‌తో నిందితులకు ఉన్న సంబంధంపై పోలీసుల ఆరా తీశారు. అసలు హత్యాయత్నం ఘటన వెనుక ఏం జరిగింది? అనే కోణంలో పోలీసులు విచారించారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఎంత..? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సుమంత్ ఎక్కడ ఉన్నాడు? అనే అంశంపై వారిని విచారిస్తున్నారు. వీరి కస్టడీలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం మత్తులో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

ఆటో మీటర్‌.. తొలి 1.6 కి.మీ.కు రూ.30

For More TG News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 08:16 AM