Share News

మద్యం మత్తులో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:55 AM

కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో రాజేష్ అనే వ్యక్తిపై శనివారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగింది. మద్యం మత్తులో రాజేష్‌పై సత్తిబాబు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

మద్యం మత్తులో దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 05: కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో రాజేష్ అనే వ్యక్తిపై శనివారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగింది. మద్యం మత్తులో రాజేష్‌పై సత్తిబాబు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తు్న్నారు. గతంలో వీరిద్దరి మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా? లేకుంటే మద్యం మత్తులో ఈ దాడి చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజధానికి రక్షణ కవచం!

ఆటో మీటర్‌.. తొలి 1.6 కి.మీ.కు రూ.30

For More TG News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 07:04 AM