Share News

హైదరాబాద్‌లో లోటు వర్షపాతం

ABN , Publish Date - Sep 05 , 2026 | 08:06 AM

ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో సెప్టెంబరు నాటికీ లోటు వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లో లోటు వర్షపాతం
Hyderabad rainfall deficit

  • జిల్లాలో 23 శాతం

  • మేడ్చల్‌ - మల్కాజిగిరిలో 35 శాతం

హైదరాబాద్‌ సిటీ: ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో సెప్టెంబరు నాటికీ లోటు వర్షపాతం నమోదైంది. అప్పుడప్పుడు మోస్తరు వర్షాలు మాత్రమే కురవడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 4 శుక్రవారం నాటికీ హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంగా 484.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 372.1 శాతం మాత్రమే నమోదైంది.


city2.2.jpgసాధారణం కంటే -23 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 467.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ 302.2 శాతం మాత్రమే నమోదైంది. అంటే 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 413.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 399.3 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 3 శాతం తక్కువ వర్ష పాతం నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 08:06 AM