ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది దుర్మరణం..
ABN , Publish Date - Sep 05 , 2026 | 07:25 AM
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్క ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
తిరువనంతపురం, సెప్టెంబర్ 5: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్క ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో కేరళ పర్యటనకు వచ్చారు. గురువాయూర్ పర్యటన ముగిసిన తర్వాత కొడుంగలూర్ వైపు బయలు దేరారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
వారు ప్రయాణిస్తున్న కారు త్రిస్సూర్ జిల్లాలోని కైపమంగలం వద్ద హైవేపై ప్రమాదానికి గురైంది. రోడ్డుపక్క ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫైర్, రెస్క్యూ, పోలీసు సిబ్బందితో పాటు స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎనిమిది మృతదేహాలను కారునుంచి బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిస్సూర్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు బ్యాటరీ నిల్వ తప్పనిసరి