Share News

అండాల అక్రమ సేకరణ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:38 PM

కొంతమంది మహిళల నుంచి అండాలను అక్రమంగా సేకరించిన కేసులో సంచలన విషయాలను మల్కాజ్‌గిరి సీపీ సుమతి వెల్లడించారు. ఈ కేసులో మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో నమోదైన మూడు కేసుల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

అండాల అక్రమ సేకరణ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..
Malkajgiri CP Sumathi

హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కొంతమంది మహిళల నుంచి అండాలను అక్రమంగా సేకరించిన కేసులో సంచలన విషయాలను మల్కాజ్‌గిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi) వెల్లడించారు. ఈ కేసులో మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో నమోదైన మూడు కేసుల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈరోజు (సోమవారం) మల్కాజ్‌గిరిలోని తన కార్యాలయంలో మీడియాతో సీపీ సుమతీ మాట్లాడారు. అండాల సేకరణ కేసులో బాధితులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించామని చెప్పుకొచ్చారు. కోర్టు అనుమతి ఇస్తే వాళ్ల స్టేట్‌మెంట్లు రికార్డు చేసి తదుపరి విచారణకు ముందుకెళ్తామని పేర్కొన్నారు. బాధితులు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పని చేస్తున్నామని అన్నారు. బాధితులకు, ఆస్పత్రులకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.


120 నకిలీ ఆధార్‌ కార్డులను గుర్తించాం..

14 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు ఇచ్చామని, 17 ఫెర్టిలిటీ సెంటర్లతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా తమ దర్యాప్తులో తేలిందని సీపీ సుమతీ పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకున్న నిందితులను వేర్వేరుగా ఉంచి విచారించామని చెప్పారు. నిందితుడు ప్రవీణ్ 120 నకిలీ ఆధార్‌ కార్డులను తయారు చేసినట్లుగా గుర్తించామన్నారు. కస్టడీ విచారణలో నిందితుల నుంచి పలు కీలక విషయాలను రాబట్టామని తెలిపారు. ఏజెంట్లు, డోనర్లు రిక్రూట్‌మెంట్ ఏ విధంగా చేస్తారనే విషయాలను నిందితుల నుంచి సేకరించామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఏఆర్టీ ఫెర్టిలిటీ, పలు ఐవీఎఫ్ సెంటర్లు రూల్స్ ఫాలో కాలేదనే విషయాన్ని గుర్తించామని అన్నారు.


ఈ కేసులో ఎవరినీ వదలిపెట్టేది లేదు..

డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్‌పైన దృష్టి పెడతామని సీపీ సుమతీ తెలిపారు. బాధితుల్లో రిపీటెడ్ డోనరులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరినీ వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నిందితుల బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించామని తెలిపారు. బాధితుల రిక్రూట్‌మెంట్ హైదరాబాద్ కేంద్రంగా జరిగిందా, ఇతర రాష్ట్రాల్లో జరిగిందా..? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఏఆర్టీ సెంటర్ల లైసెన్సులు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నాయనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని సీపీ సుమతీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:07 PM