Share News

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 10:28 AM

హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. జల్‌పల్లి బాలాజీనగర్‌లో ఉన్న ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ పరిశ్రమలో ఎగిసిపడుతున్న మంటలు
Hyderabad Fire Accident

హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు (మంగళవారం) అగ్నిప్రమాదం జరిగింది. జల్‌పల్లి బాలాజీనగర్‌లో ఉన్న ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన పరిశ్రమ ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించింది కావడంతో, లోపల ఉన్న ముడిసరుకు కారణంగా మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. పరిశ్రమ నుంచి పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, పొగలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పహాడీషరీఫ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


పోలీసుల చర్యలు..

అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్‌ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చలు

కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 10:31 AM