హైదరాబాద్‌లో బైక్‌ను ఢీకొట్టిన థార్ వాహనం.. ఒకరి మృతి
ABN , Publish Date - Aug 10 , 2026 | 10:29 AM
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరిగింది.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వచ్చిన థార్ వాహనం.. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన చెల్లా శ్రీనివాసులు (50) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివకుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందగానే ఘటనాస్థలికి మాదాపూర్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News