‘సర్’ పేరుతో మైనారిటీల ఓట్ల తొలగింపు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:44 PM
‘సర్’ పేరుతో ఎలక్షన్ కమిషనర్ మైనారిటీల ఓట్లను తొలగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
సిద్ధిపేట, అక్టోబర్ 11: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ‘సర్’ పేరుతో మైనారిటీల ఓట్లను తొలగిస్తున్నారని.. వారి హక్కులను కాలరాసేలా కుట్రకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు సిద్ధిపేటలో నిర్వహించిన మైనారిటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. ‘సర్’ పేరుతో ఇప్పటివరకు 13 కోట్ల మంది మైనారిటీల ఓట్లను తొలగించారని కేటీఆర్ తెలిపారు. దీనిపై దేశ రాజధానిలో యువత ధర్నాలు , రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతున్నా.. కేంద్ర ప్రభుత్వంలో చలనం కలగడం లేదని విమర్శించారు. వారి నిరసన గళాన్ని అణచివేయడానికి.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. ఢిల్లీ వ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసిందని.. పెట్రోల్ బంకులను, రోడ్డు మార్గాలను మూసివేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీలోనే కాదు.. తెలంగాణలో కూడా ప్రభుత్వం ఇదే కుట్ర చేయబోతోందని.. మైనారిటీలంతా ఒకటై ఈ కుట్రను అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి: మంత్రి కొల్లు రవీంద్ర
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్
For More TG News And Telugu News