కేఆర్ఎంబీ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కుదరని ఏకాభిప్రాయం
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:32 PM
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు (శుక్రవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు పేర్కొన్నారు. అయితే, నీటి పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపారు. సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని వెల్లడించారు. తాగునీటిపై సుదీర్గంగా చర్చించామని అన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో 50:50 వాటా కావాలని కోరామని ఈఎన్సీ రమేశ్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 66:34 వాటా లెక్కన పంపిణీ చేయాలని డిమాండ్ చేసిందని అన్నారు. ఏపీ డిమాండ్‌ను తెలంగాణ వ్యతిరేకించిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను తీసుకుపోతోందని తెలిపారు. మొత్తం తెలంగాణ 200 టీఎంసీలు - ఏపీ 100 టీఎంసీలను అడిగిందని చెప్పారు. ప్రస్తుతం కేఆర్ఎంబీ పరిధిలో 142 టీఎంసీలు ఉన్నాయని ఈఎన్సీ రమేశ్ బాబు పేర్కొన్నారు.
ఈ భేటీ అసంతృప్తిగా ముగిసింది: ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి
కేఆర్ఎంబీ త్రిమెన్ కమిటీ భేటీ అసంతృప్తిగా ముగిసిందని ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి తెలిపారు. నాగార్జున సాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను వాడుతుందని.. వాటిని వెంటనే నిలిపివేయాలని కోరామని అన్నారు. డ్రింకింగ్ వాటర్ వాటా 66:34 శాతం కేటాయింపులు జరపాలని ఏపీ కోరిందని చెప్పారు. 66:34శాతం వాటా ప్రకారం 97 టీఎంసీలు విడదల చేయాలని కోరారు.
66:34 శాతం వాటాకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి ప్రస్తావించారు. డ్రింకింగ్ వాటర్ వాటా 104 టీఎంసీలు ఏపీకి కావాలని కోరామని.. తెలంగాణ 200 టీఎంసీలు అడిగిందని తెలిపారు. పోతిరెడ్డిపాడు ఇతర ప్రాజెక్ట్‌ల నుంచి వాటా మేరకే నీళ్లను వాడుతున్నామని ఏపీ ఈఎన్సీ నరసింహ మూర్తి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి
22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్
హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News