Share News

హైదరాబాద్‌లో విషాదం.. రెండేళ్ల కూతురిని చంపేసి..

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:24 PM

హైదరాబాద్‌ కేపీహె‌చ్‌బీ కాలనీలో విషాద ఘటన జరిగింది. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో కేపీహె‌చ్‌బీ కాలనీ ఫేజ్-3లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

హైదరాబాద్‌లో విషాదం.. రెండేళ్ల కూతురిని చంపేసి..
Hyderabad KPHB Colony Tragedy

హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేపీహె‌చ్‌బీ కాలనీలో విషాద ఘటన జరిగింది. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో కేపీహె‌చ్‌బీ కాలనీ ఫేజ్-3లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు రెండేళ్ల పాపను సైతం చంపేశారు. ‘మా చావుకు ఎవరూ కారణం కాదని.. వేరే వారిని వివరాలు అడగొద్దు’ అంటూ గోడ మీద రాసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.


ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులది పశ్చిమబెంగాల్‌కు చెందిన గోపి, సమతగా గుర్తించారు. మృతుడు గోపి రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సమత ఇంట్లోనే ఉంటోంది. దంపతులిద్దరికీ రెండేళ్ల పాప స్నిగ్థ ఉంది. ఆర్థిక ఇబ్బందులతోనే సూసైడ్‌‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమబెంగాల్లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతిచెందడంతో బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!

విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 07:58 PM