Share News

తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌

ABN , Publish Date - May 08 , 2026 | 10:07 AM

తెలంగాణ రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌
Kishan Reddy

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • మోదీ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించబోయే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం వినయ్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌లో భాగ్యనగర్‌ జిల్లాలో జనసమీకరణపై నిర్వహించిన సన్నాహక సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.


మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. నగరంలో రూ.8వేలకోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మోదీ వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీ నుంచి బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.


city5.jpgఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జంగం శ్వేతారెడ్డి, కొత్తకాపు అరుణారవీందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీకొటి ప్రవీణ్‌, జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌ యాదవ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్‏చందర్జీ, సురేందర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, వీరేందర్‌ బాబు, నేతలు సహదేవ్‌యాదవ్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌రెడ్డి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదే జరిగితే.. 107 మంది రాజీనామా!

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2026 | 10:07 AM