Share News

అమ్మాయి వెంట పడకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వండి

ABN , Publish Date - May 08 , 2026 | 07:51 AM

అమ్మాయిలకు వల వేసి శారీరక సంబంధాలతోపాటు లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసిన చంద్రశేఖర్‌ అజాద్‌ వ్యవహారంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అమ్మాయి వెంట పడకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వండి
Chandrashekhar Azad, alias Arjun

  • బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడిన చంద్రశేఖర్‌ తల్లి, మేనమామ

హైదరాబాద్: అమ్మాయిలకు వల వేసి శారీరక సంబంధాలతోపాటు లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసిన చంద్రశేఖర్‌ అజాద్‌ వ్యవహారంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి తండ్రిని బ్లాక్‌మెయిల్‌ చేసి అమ్మాయి వెంట పడకుండా ఉండేందుకు రూ.25లక్షలు ఇవ్వాలని చంద్రశేఖర్‌ తల్లి, అతని మేనమామ డిమాండ్‌ చేసినట్టు తేలింది. వివరాలిలా ఉన్నాయి.


జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో నివసించే బాలికతో పరిచయం పెంచుకున్న చంద్రశేఖర్‌ అజాద్‌ అలియాస్‌ అర్జున్‌ ప్రేమ పేరుతో ఆమెను మభ్యపెట్టి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె ద్వారా ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.13 లక్షలను చంద్రశేఖర్‌ తీసుకున్నాడు. కొద్దిరోజులకు మోసపోయిన విషయం తెలిసిన బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చంద్రశేఖర్‌ అజాద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


ఇదిలాఉండగా తన కుమార్తె వెంట పడకుండా చూడాలని చంద్రశేఖర్‌ తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్‌ను బాధితురాలి తండ్రి కలిసి విజ్ఞప్తి చేశాడు. అయితే, బాలిక వెంట పడకుండా ఉండాలంటే రూ.25 లక్షలను ఇవ్వాలని వారిద్దరూ డిమాండ్‌ చేశారు. దీంతో బాలిక తండ్రి మళ్లీ పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదే జరిగితే.. 107 మంది రాజీనామా!

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2026 | 07:51 AM