Share News

ముంబై ఫ్యామిలీ అనుమానాస్పద మృతి.. పుచ్చకాయలో బయటపడ్డ ఎలుకల మందు..

ABN , Publish Date - May 08 , 2026 | 07:04 AM

ఫోరెన్సిక్ పరీక్షల్లో నలుగురి మృతికి కారణం ఏంటో స్పష్టం అయింది. ఎలుకలను చంపడానికి వాడే విషం మృతుల శరీరాల్లో బయటపడింది. అంతేకాదు.. మృతులు తిన్న పుచ్చకాయలోనూ ఎలుకల మందు అవశేషాలు బయటపడ్డాయి.

ముంబై ఫ్యామిలీ అనుమానాస్పద మృతి.. పుచ్చకాయలో బయటపడ్డ ఎలుకల మందు..
rat poison in watermelon

ఇంటర్‌నెట్ డెస్క్: ముంబైకి చెందిన నలుగురు కుటుంబసభ్యులు పుచ్చకాయ తిన్న తర్వాత ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ పరీక్షల్లో నలుగురి మృతికి కారణం ఏంటో స్పష్టం అయింది. ఎలుకలను చంపడానికి వాడే విషం మృతుల శరీరాల్లో బయటపడింది. అంతేకాదు.. మృతులు తిన్న పుచ్చకాయలోనూ ఎలుకల మందు అవశేషాలు బయటపడ్డాయి. ఫోరెన్సిక్ వైద్యులు మృతుల శరీరాల్లో ఎలుకలను చంపడానికి వాడే జింక్ పాస్పైట్‌ను గుర్తించారు. వారు తిన్న పుచ్చకాయలోనూ జింక్ పాస్పైట్‌ను కనుగొన్నారు.


ఎలుకల మందు పుచ్చకాయలో ఎలా కలిసిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పొరపాటున ఎలుకల మందు పుచ్చకాయలో కలిసిందా లేక వారే పుచ్చకాయ మీద చల్లుకుని తిన్నారా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాగా, ముంబైలోని పైధోనీ ఏరియాకు చెందిన 40 ఏళ్ల అబ్దుల్లా దొకాడియా, అతడి భార్య నస్‌రీన్, ఇద్దరు కూతుళ్లు 25వ తేదీ రాత్రి బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న గంట తర్వాత పుచ్చకాయ తిని పడుకున్నారు. కొంతసేపటికే నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల నొప్పి, కడుపునొప్పి మొదలయ్యాయి.


మరుసటి రోజు ఉదయానికి అబ్దుల్లా ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. కొన్ని గంటల తర్వాత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్దుల్లా, నస్‌రీన్‌ చనిపోయారు. పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్లే వారు చనిపోయారని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పుచ్చకాయ సేల్స్ దారుణంగా దెబ్బ తిన్నాయి. అయితే, వైద్య పరీక్షల్లో మృతుల బ్రెయిన్, గుండె, పేగులు ఆకుపచ్చగా మారిపోయినట్లు తేలింది. లక్షణాలు, అంతర్గత ఫలితాలను ఆధారంగా చేసుకుని అది ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఆస్కారం లేదని ఫోరెన్సిక్ వైద్యులు తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 08 , 2026 | 08:28 AM