Share News

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 08 , 2026 | 06:51 AM

అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే ఉత్తమ సాధనంగా పెట్టుబడిదారులు బంగారాన్ని భావిస్తున్నారు. దీంతో పసిడిని ఒక ముఖ్యమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ మేరకు కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Today Gold and Prices

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే ఉత్తమ సాధనంగా పెట్టుబడిదారులు బంగారాన్ని భావిస్తున్నారు. దీంతో పసిడిని ఒక ముఖ్యమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ మేరకు కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఈరోజు (శుక్రవారం) గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం భారతదేశంలో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.15,301 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.14,026కి చేరుకుంది. ఇక, 18 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.11,476గా ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,160 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,410కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,010 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,40,260గా ఉంది. ఇక, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,010కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,260కి చేరుకుంది. వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబైలో గురువారం రోజుతో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,70,100కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.2,74,900గా ఉంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలు కూడా చదవండి

ఏఐతో ‘సాంప్రదాయ ఐటీ’కి భంగం

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

Updated Date - May 08 , 2026 | 07:06 AM