సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు
ABN , Publish Date - May 08 , 2026 | 06:58 AM
రాష్ట్ర భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లో తక్షణం ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లో తక్షణం ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. రిటైరైన అఽధికారులను ఓఎస్డీలుగా నియమించుకోవడమనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకోవడానికి కారణాలేంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సదరు పిటిషనర్ అంతకుముందు.. శివధర్‌రెడ్డిని తాత్కాలిక డీజీపీగా నియమించడం చెల్లదంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది పెండింగ్‌లో ఉండగానే మరో అప్లికేషన్ దాఖలు చేశారు.