Share News

అదే జరిగితే.. 107 మంది రాజీనామా!

ABN , Publish Date - May 08 , 2026 | 06:04 AM

‘‘ప్రజల మద్దతు మనకే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశం మనకే రావాలి. అలా కాదని... డీఎంకే, అన్నాడీఎంకే కలిసి సర్కారును...

అదే జరిగితే.. 107 మంది రాజీనామా!

డీఎంకే-అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు యత్నాలపై విజయ్‌ గుర్రు?

చెన్నై, మే 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల మద్దతు మనకే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశం మనకే రావాలి. అలా కాదని... డీఎంకే, అన్నాడీఎంకే కలిసి సర్కారును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే మొత్తం 107 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసేస్తాం’’ అని టీవీకే చీఫ్‌ విజయ్‌ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విజయ్‌ వరుసగా రెండు రోజులు గవర్నర్‌ను కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కలేదు. మరోవైపు... ‘మళ్లీ ఎన్నికలు రాకుండా చూడటం... సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు’ సహా డీఎంకే గురువారం నాలుగు తీర్మానాలు చేసింది. ‘మళ్లీ ఎన్నికలు రాకూడదు’ అనుకుంటే ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలి. లేదా, అన్నాడీఎంకేతో కలిసి తామే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలి. రెండు ప్రధాన ‘ద్రవిడ’ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని విజయ్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 06:06 AM