Share News

కేసీఆర్‌లానే రేవంత్ కూడా భూములమ్మే ప్రయత్నం: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Sep 05 , 2026 | 03:18 PM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ధరణి పేరుతో బీఆర్‌ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు భూభారతి పేరుతో కాంగ్రెస్ అవినీతికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌లానే రేవంత్ కూడా భూములమ్మే ప్రయత్నం: కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 5: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ధరణి పేరుతో బీఆర్‌ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు భూభారతి పేరుతో కాంగ్రెస్ అవినీతికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు దోచుకోవడానికే 22A తీసుకొచ్చారని అన్నారు. పట్టాలు, పర్మిషన్లు ఉన్న భూములను 22Aలో చేర్చారని మండిపడ్డారు. కేసీఆర్‌లానే రేవంత్ కూడా భూములమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం భూములు అమ్మడమే అంటూ వ్యాఖ్యానించారు.


భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. వక్ఫ్ భూములపై తప్ప అన్ని భూములపై సీఎం రేవంత్ కన్నేశారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణలో భూములు అమ్మాలని.. ఢిల్లీలోని కాంగ్రెస్‌కు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను RR రియల్ ఎస్టేట్‌ సంస్థగా మార్చారంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?: మాజీ మంత్రి కేటీఆర్

సురేఖను కాపాడేందుకు చాలా ప్రయత్నించాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 03:51 PM