సురేఖను కాపాడేందుకు చాలా ప్రయత్నించాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:54 PM
తెలంగాణలో కొండా సురేఖ బర్తరఫ్ అంశం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మంత్రివర్గం నుంచి సురేఖ తొలగింపు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5: తెలంగాణలో కొండా సురేఖ బర్తరఫ్ అంశం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మంత్రివర్గం నుంచి సురేఖ తొలగింపు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు(శనివారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామని తెలిపారు. సురేఖ విషయంలో అందరం తమ వంతు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. కొండా సురేఖ బర్తరఫ్ పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమని.. ఆమె విషయంలో హైకమాండ్ ఒప్పుకోలేదని టీపీసీసీ చీఫ్ అన్నారు.
ఇక, క్యాబినెట్ విస్తరణపై మాట్లాడిన మహేశ్.. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లే అని స్పష్టం చేశారు. ఢిల్లీలో క్యాబినెట్ విస్తరణపై చర్చ జగలేదన్నారు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపైనే చర్చ జరిగినట్లు చెప్పుకొచ్చారు. క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమన్నారు. ‘నాకు మంత్రి పదవి అన్న ప్రచారంపై సమాచారం లేదు’ అని వెల్లడించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ నెరవేర్చారని టీపీసీసీ చీఫ్ అన్నారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశామని తెలిపారు. రాబోయే వంద రోజులు దేశ వ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తామన్నారు. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయాలని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే: ఎంపీ రఘునందన్
కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?: మాజీ మంత్రి కేటీఆర్
Read Latest Telangana News And Telugu News