Share News

ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. హైపవర్ కమిటీ సమావేశంలో నిర్ణయం

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:44 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది.

ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. హైపవర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 5: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై, ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం నాలుగు అంచెల కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. 2026లో ఇప్పటి వరకూ నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతమైనట్లు అధికారులు తెలిపారు.


ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, 1 ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో రూ.15.43 కోట్ల పరిహారం అందించినట్టు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ, రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి విజిలెన్స్ కమిటీల ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రులు డీబీవీ స్వామి, వి.అనిత, జి.సంధ్యారాణి, ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, ఎమ్మెల్యేలు, సభ్యులు, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు: చంద్రబాబు, పవన్, లోకేశ్

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 12:47 PM