గోదావరి నదిలోకి దూకిన కుటుంబం.. భార్యను రక్షించిన జాలర్లు
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:16 AM
పశ్చిమగోదావరి జిల్లాలో ఓకే కుటుంబానికి చెందిని నలుగురు గోదావరి నదిలో దూకేయడం కలకలం రేపుతోంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురు కుటుంసభ్యులు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 5: జిల్లాలో ఓకే కుటుంబానికి చెందిని నలుగురు గోదావరి నదిలో దూకేయడం కలకలం రేపుతోంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురు కుటుంసభ్యులు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నంబూరి శ్రీనివాస్ (45), పద్మిని (42), ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వీరు నదిలోకి దూకడాన్ని చూసిన జాలర్లు అప్రమత్తమై వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో భార్య నంబూరి పద్మిని జాలర్లు కాపాడారు. అలాగే, భర్త శ్రీనివాస్, ఇద్దరు పిల్లల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
తణుకు నుంచి రెండు బైక్‌లపై వచ్చిన కుటుంబం.. గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. అయితే ఆర్థిక సమస్య వల్ల ఈ అఘాయిత్యానికి యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలతో బయటపడ్డ పద్మిని నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. గోదావరి నదిలోకి దూకి ఓ కుటుంబం బలవర్మణానికి యత్నించడం సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసు.. రెండో రోజు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News