నల్లజర్ల పీఎస్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:12 AM
రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజాపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.
రాజమండ్రి, సెప్టెంబర్ 05: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజాపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును జక్కంపూడి రాజా దూషించారు. దీనిపై దూబచర్లకు చెందిన బోడిగడ్డ నాగ రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేపై Cr. No. 216/2026 U/s 196 (1), 353(1), (b), (c), 353 (2), 352, 356 BNS and Sec. 3 (1) (r), 3(1) (s) SC ST POA act 1989 of Nallajerla PSలో కేసు నమోదు చేశారు.
సెప్టెంబర్ 2వ తేదీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. దీనిని పురస్కరించుకుని ఈ నెల రెండవ తేదీ నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత మద్దిపాటి వెంకట్‌రాజును వైసీపీ నేత ఈ సభా వేదిక మీద నుంచి తీవ్రంగా దూషించారు. దాంతో ఆ గ్రామస్తుడు బోడిగడ్డ నాగ రఘు పోలీసులకు జక్కంపూడి రాజాపై ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఈవో సీఎంగా కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నా: సీఎం చంద్రబాబు
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు ముమ్మరం
For More AP News And Telugu News